: కొత్త యూజర్లను ఆకర్షించేందుకు దీర్ఘకాలిక డేటా ప్యాక్‌లు ప్రారంభించండి.. టెల్కోలను కోరిన ట్రాయ్!


కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు ఏడాది కాలవ్యవధితో డేటా ప్యాక్‌లు ప్రారంభించాలని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ టెల్కోలను కోరింది. మార్జినల్ యూజర్లు, తొలిసారి డేటా ఉపయోగిస్తున్న వారిని ప్రోత్సహించేందుకు ఇది చాలా ఉపయోగపడుతుందని పేర్కొంది. ఏడాది కాల వ్యవధితో డేటా ప్యాక్‌లు ప్రారంభించేందుకు ట్రాయ్ గతేడాదే అనుమతి ఇచ్చినా ఇప్పటి వరకు సర్వీస్ ప్రొవైడర్లు ఒక్క ప్యాక్‌ను కూడా ప్రారంభించకపోవడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది.

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మినహా ఒక్క ప్రైవేటు సంస్థ కూడా ఇప్పటి వరకు 365 రోజుల వ్యాలిడిటీ కలిగిన డేటా ప్యాక్‌లు ప్రారంభించలేదని ట్రాయ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయమన్నారు. గతేడాది టెల్కోల విన్నపంతోనే ట్రాయ్ 365 రోజుల కాలవ్యవధి కలిగిన డేటా ప్యాక్‌ల ప్రారంభానికి అనుమతిచ్చింది. అయితే ఇప్పటి వరకు ఒక్కరు కూడా అటువంటి ప్యాక్‌లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News