: ఎయిర్‌సెల్ నుంచి కనీవినీ ఎరుగని ఆఫర్.. రూ.98కే 10 జీబీ డేటా!


టెలికం సర్వీస్ ప్రొవైడర్ ఎయిర్‌సెల్ బంపర్ ఆఫర్‌తో ముందుకొచ్చింది. ‘డేటా ఆన్ డిమాండ్’ పేరుతో సరికొత్త ప్లాన్‌ను పరిచయం చేసింది. దీనివల్ల వినియోగదారులకు తాము ఉపయోగిస్తున్న డేటాపై నియంత్రణ ఉంటుందని ఎయిర్‌సెల్ చెబుతోంది. ప్రస్తుతం ఈ ప్లాన్ కోల్‌కతా, పశ్చిమబెంగాల్, బీహార్, ఒడిశా, ఈశాన్య భారతం, అసోం రాష్ట్రాలలో మాత్రమే అందుబాటులో ఉంది.

ఈ సర్వీసుల కింద అందుబాటులోకి తెచ్చిన తాజా ప్యాక్‌లలో భాగంగా రోజూ గంటపాటు ఉచితంగా డేటా లభిస్తుంది. అదనంగా మరో 1జీబీ డేటా కావాలంటే రూ.9 చెల్లించాల్సి ఉంటుంది. రూ.65 రీచార్జ్‌తో వినియోగదారులు 1జీబీ 3జీ డేటా 4 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది. అలాగే రోజూ గంటపాటు 1జీబీ డేటాను నాలుగు రోజులపాటు అదనంగా పొందవచ్చు. అంటే మొత్తంగా 5జీబీ డేటా అన్నమాట.  అలాగే రూ.98 రీచార్జ్‌తో 2జీబీ 3జీ డేటాను 8 రోజులపాటు పొందవచ్చు. అలాగే ఎనిమిది రోజులపాటు రోజూ గంటపాటు 1జీబీ డేటాను అదనంగా పొందవచ్చు. అంటే మొత్తం 10 జీబీ డేటా అన్నమాట. అంతేకాక అదనపు డేటా కావాలంటే రూ. 9 చెల్లించి 1జీబీ డేటాను పొందవచ్చని ఎయిర్‌సెల్ తెలిపింది.

  • Loading...

More Telugu News