: అమ్మాయి గురించి కాదు... 'అమ్మ' గురించి అడగండి!: మీడియాపై మండిపడ్డ సినీ నటి శ్రీదేవి


త్వరలో తెరంగేట్రం చేయనున్న తన కూతురు జాహ్నవి ఫొటోలు తీయొద్దని, అందుకు సంబంధించిన ప్రశ్నలు వేయొద్దని మీడియాపై ప్రముఖ సినీ నటి శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీదేవి నటించిన ‘మామ్’ ట్రైలర్ విడుదల కార్యక్రమం ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమానికి తన ఇద్దరు కూతుళ్లు జాహ్నవి, ఖుషితో కలిసి శ్రీదేవి హాజరైంది. కవరేజ్ నిమిత్తం అక్కడికి వచ్చిన మీడియా, శ్రీదేవి గురించి కాకుండా, జాహ్నవి నటించబోయే సినిమాల గురించి ప్రశ్నించింది. దీంతో, శ్రీదేవికి కోపమొచ్చింది. ఈ కార్యక్రమం జాహ్నవి కోసం ఏర్పాటు చేసింది కాదని, ఆమె తల్లి కోసం ఏర్పాటు చేసిందంటూ ఘాటుగా చెప్పింది. జాహ్నవి నటించబోయే సినిమాల గురించి త్వరలోనే చెప్తానంటూ మీడియాపై శ్రీదేవి మండిపడింది.

  • Loading...

More Telugu News