: ‘కాంగ్రెస్’ కొత్త నాటకానికి తెరలేపింది: దేవినేని ఉమా
ఏపీకి చేసిన అన్యాయాన్ని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కొత్త నాటకానికి తెరలేపిందని మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. ఏపీ అభివృద్ధికి కాంగ్రెస్ ఏమాత్రం దోహదం చేయదని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్ట్ కు రూ.3,349 కోట్లు ఖర్చు చేశామని, కాంగ్రెస్ హయాంలో మాత్రం కేవలం రూ.562 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అన్నారు. చంద్రబాబు కృషి వల్లే ఈ ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతున్నాయని కితాబిచ్చారు. ‘పోలవరం’ పూర్తవుతుంటే కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేకపోతోందని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో ఎందుకు పెట్టలేదని కాంగ్రెస్ నేతలను ఆయన ప్రశ్నించారు.