: ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం!
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు సాయంత్రం వర్షం కురిసింది. గుంటూరులోని మంగళగిరిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిసరాల్లోనూ వర్షం పడింది. మరోవైపు విజయవాడలోని పలు చోట్ల వర్షం కురిసింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిక చేసింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో పలు చోట్ల చెట్లు విరిగి పడి, వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సింగరాయకొండ మండలం శానంపూడిలో పిడుగుపాటుకు మహిళ మృతి చెందింది. టంగుటూరు-సూరారెడ్డిపాలెం మధ్య విద్యుత్ లైన్ తెగిపడింది.