: ఈ నెల 25 నుంచి బోనాల జాతర


తెలంగాణలో బోనాల జాతరకు ముహూర్తం ఖరారైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ నెల 25న బోనాల జాతర ప్రారంభమై జులై 23న ముగుస్తుందని చెప్పారు. గోల్కొండ కోటలోని ఎల్లమ్మ ఆలయంలో తొలి పూజను పూజారులు నిర్వహించి బోనం సమర్పించడంతో జాతర ప్రారంభమవుతుందని అన్నారు. జులై 2న గోల్కొండ బోనాలు, జులై 9, 10 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు, జులై 16వ తేదీన లాల్ దర్వాజ అమ్మవారి బోనాలు నిర్వహించనున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News