: ఇస్రో ‘బాహుబలి’ సూపర్ హిట్!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘన విజయాన్ని సాధించింది. నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్వీ మార్క్-3 డీ1 రాకెట్ ... జీశాట్-19 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగాన్ని ఇస్రో ఛైర్మన్ కిరణ్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల శాస్త్రవేత్తలు సహా దేశంలోని ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో తన చరిత్రలోనే అతిపెద్ద ప్రయోగం చేసింది. ఇస్రో శాస్త్రవేత్తల కృషిని కిరణ్ కుమార్ అభినందించారు. ఈ ఉపగ్రహం 200 ఏనుగుల బరువుగలది. దీనిని దేశ వ్యాప్తంగా బాహుబలి అంటూ పేర్కొంటున్న విషయం తెలిసిందే.