: ఇండియా-పాక్ మ్యాచ్ లో ఉండాల్సిన మజాను నీరుగార్చారు: అఫ్రిదీ
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ చేతిలో పాకిస్థాన్ చతికిల పడటంపై ఆ దేశ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ ఆవేదన వ్యక్తం చేశాడు. భారత్-పాక్ ల మధ్య మ్యాచ్ అంటేనే హై ఓల్టేజ్ ఉంటుందని... అలాంటి మ్యాచ్ ను పాక్ తన ఆట తీరుతో నీరుగార్చిందని అన్నాడు. మ్యాచ్ లోని మజాను అనుభవించకుండా పాక్ ఆటగాళ్లు చేశారని చెప్పాడు. పాకిస్థాన్ అభిమానిగా ఇది తనకు ఎంతో బాధ కలిగించే అంశమని తెలిపాడు. పాక్ ఫీల్డింగ్ లో పసలేదని... సర్కిల్ లోపల చాలా పరుగులను ఉదారంగా ఇచ్చేశారని విమర్శించాడు. మరోవైపు టీమిండియాపై అఫ్రిదీ ప్రశంసలు కురిపించాడు. ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా... అసలైన ఫేవరెట్ గానే ఆడిందని కితాబిచ్చాడు. ఐసీసీకి రాసిన కాలమ్ లో అఫ్రిదీ ఈ మేరకు స్పందించాడు.