: ఇక అధికారులెవ్వరూ కిరణ్ బేడీని కలవకూడదు: పుదుచ్చేరి సీఎం ఆదేశాలు


తమ లెఫ్టినెంట్‌ గవర్నర్ కిరణ్ బేడీని ఇక అధికారులెవ్వరూ కలవకూడదని, ఒకవేళ తప్పనిసరి అయితే ముందుగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి ఆదేశించారు. లెఫ్టినెంట్‌ గవర్నర్ గా కిరణ్ బేడి నియమితం అయినప్పటి నుంచి వి.నారాయణ స్వామికి ఆమెతో ప‌డ‌డం లేద‌న్న విష‌యం తెలిసిందే. వారిద్ద‌రి మ‌ధ్య విభేదాలు మ‌రింత పెర‌గ‌డంతో సీఎం ఇటువంటి ఆదేశాలు జారీ చేశారు. పీజీ మెడికల్‌ అడ్మిషన్ల ప్రక్రియలో కిరణ్‌బేడీ అన‌వ‌స‌రంగా జోక్యం చేసుకుంటున్నారని నారాయణస్వామి విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేగాక‌, త‌మ‌ మంత్రులను, ఎమ్మెల్యేలపై సామాజిక మాధ్య‌మాల్లో ప‌లు వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఇటువంటి చ‌ర్య‌లు మానుకోవాల‌ని ఆయ‌న ఇటీవ‌లే అసెంబ్లీలో వ్యాఖ్యానించారు.  

నారాయ‌ణస్వామి వ్యాఖ్య‌ల‌పై కిరణ్‌బేడీ స్పందిస్తూ.. ప్ర‌భుత్వం కోరుకుంటున్నది రబ్బర్‌ స్టాంపునా? లేక‌ బాధ్యతాయుతమైన పాలకురాలినా? అని అన్నారు. ప్ర‌జ‌ల‌కు న్యాయం, మంచి పాలన కావాలని అన్నారు. 

  • Loading...

More Telugu News