: ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన వార్నర్!


ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ)కు, ఆ దేశ క్రికెటర్లకు మధ్య నెలకొన్న కొత్త కాంట్రాక్ట్ విధానం మరింత ముదిరింది. తమ షరతులకు అంగీకారం తెలిపిన వారికి మాత్రమే కొత్త కాంట్రాక్ట్ ఇస్తామంటూ సీఏ పెట్టిన నిబంధనను ఆ దేశ స్టార్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ తప్పుబట్టాడు. బోర్డు తీసుకొస్తున్న కొత్త కాంట్రాక్టును తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని చెప్పాడు. జూలై 1వ తేదీ తర్వాత తమకు కాంట్రాక్టు ఇవ్వకపోతే, క్రికెట్ ఆడటం మానేస్తామని హెచ్చరించాడు. ప్రస్తుతం టీములో ఉన్న చాలా మంది ఆటగాళ్ల కాంట్రాక్ట్ ను పునరుద్ధరించేందుకు సీఏ సుముఖంగా లేదని ఈ మెయిల్స్ ద్వారా తెలుస్తోందని వార్నర్ చెప్పాడు. ఏం జరగబోతోందో కాలమే నిర్ణయిస్తుందని తెలిపాడు. మిగిలిన ఆటగాళ్ల తరపున వకాల్తా పుచ్చుకున్న వార్నర్ ఈ మేరకు బోర్డును హెచ్చరించాడు.  

  • Loading...

More Telugu News