: భారత్ కు ఇక ఎదురేలేదనేది స్పష్టమైంది!: కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్


నిన్న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా విజయ దుందుభి మోగించిన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో టీమిండియా సార‌థి విరాట్ కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ స్పందిస్తూ.. ఈ టోర్నీలో భారత్ కు ఎదురేలేదనేది స్పష్టమవుతోందని అన్నారు. భారత్ కు కఠినమైన ప్రత్యర్థి ఒక్క‌ దక్షిణాఫ్రికా మాత్ర‌మేన‌ని ఆయ‌న అన్నారు. ఆ టీమ్‌పై కూడా విజ‌యం సాధించే స‌త్తా భారత్ కు ఉంద‌ని చెప్పారు. ద‌క్షిణాఫ్రికాను కూడా ఓడించి టైటిల్ ఈ సారి కూడా భార‌తే కొట్టేస్తుంద‌ని జోస్యం చెప్పారు. రోహిత్ శర్మ-శిఖర్ ధావన్ ల జోడి, యువరాజ్ సింగ్-విరాట్ కోహ్లిల జోడి నిన్న‌టి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించింద‌ని అన్నారు. 

  • Loading...

More Telugu News