: కలలో శివలింగం కనిపించిందంటూ నడి రోడ్డుపై యువకుడి విచిత్ర చేష్టలు


కంప్యూటర్ యుగంలోనూ మూఢనమ్మకాలు ఇంకా చావ‌లేదు. ఎవ‌రో ఏదో చెప్ప‌డం.. దాన్ని గ్రామ‌స్తులంద‌రూ న‌మ్మేయడం.. చిత్ర విచిత్ర పోక‌డ‌లు పోవ‌డం.. సాధార‌ణ‌మైపోతోంది. ఐదేళ్లుగా తనకు కలలో శివలింగం కనిపిస్తోందంటూ ఓ యువకుడు విచిత్రంగా ప్రవర్తించిన ఘటన జ‌న‌గామ జిల్లా పెంబ‌ర్తిలో చోటుచేసుకుంది. అత‌డి మాట‌లు న‌మ్మిన గ్రామ‌స్తులు రోడ్డు న‌డి మ‌ధ్య‌లో ఏకంగా 10 అడుగుల గోతిని త‌వ్వేసి, అందులో శివ‌లింగం కోసం వెతికారు. ఓం న‌మఃశివాయ అంటూ తన శరీరాన్ని ఊపేస్తూ ఆ యువ‌కుడు ఊగిపోయాడు. వ‌రంగ‌ల్ జాతీయ ర‌హ‌దారి ప‌క్క‌నే ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డంతో ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ‌కు చేరుకొని ఆ యువ‌కుడితో పాటు అత‌డి విచిత్ర చేష్ట‌ల‌ను నమ్మి అంత పెద్ద గోతి తవ్విన మ‌రో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.  

  • Loading...

More Telugu News