: 8 నుంచి మోటో జెడ్2 ప్లేకు ముందస్తు ఆర్డర్లు


గత వారం అమెరికా మార్కెట్లోకి అడుగు పెట్టిన మోటో జెడ్2 ప్లే స్మార్ట్ ఫోన్ కోసం భారతీయ కస్టమర్లు వచ్చే గురువారం (ఈ నెల 8) నుంచి ముందస్తు ఆర్డర్ చేసుకోవచ్చని లెనోవో ప్రకటించింది. ఆసక్తిగల కస్టమర్లు ముందుగా 2,000 చెల్లించి మిగిలిన మొత్తాన్ని 10 నెలల్లో వడ్డీ లేకుండా చెల్లించొచ్చని పేర్కొంది. స్మార్ట్ ఫోన్ రక్షణ కోసం పలు యాసెసరీలతో కూడిన మోటో ఆర్మర్ ప్యాక్ ను ముందుగా ఆర్డర్ చేసిన వారికి ఇవ్వనున్నట్టు కూడా తెలిపింది. అమెరికా మార్కెట్లో మోటో జెడ్ 2 ప్లే ధర 499 డాలర్లు (రూ.32,000)గా ఉంది.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ నౌగత్ సాఫ్ట్ వేర్ పై పనిచేస్తుంది. 5.5 అంగుళాల ఫుల్ హెడ్ డీ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే (కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్), 2.2 గిగాహెర్జ్ స్నాప్ డ్రాగన్ 626 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉన్నాయి. 2జీబీ ర్యామ్/32జీబీ స్టోరేజీ, 4జీబీ ర్యామ్/64జీబీ ర్యామ్ సామర్థ్యంతో రెండు రకాలున్నాయి.  

  • Loading...

More Telugu News