: నంద్యాల వైసీపీ అభ్యర్థిని ప్రకటించిన కాటసాని
నంద్యాల ఉప ఎన్నికలో తమ అభ్యర్థిని వైసీపీ ప్రకటించింది. పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగుతారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వైసీపీ ప్లీనరీలో ప్రకటించారు. నంద్యాల నియోజకవర్గ ప్లీనరీ నిన్న మున్సిపల్ టౌన్ హాల్ లో జరిగింది. ఈ సందర్భంగా కాటసాని ఉన్నట్టుండి మల్కిరెడ్డి పేరును ప్రకటించారు. మరోవైపు, టీడీపీ పక్షాన భూమా వర్గం తరపున రేసులో ఉన్న భూమా బ్రహ్మానందరెడ్డికి కాటసాని స్వయానా మామ కావడం గమనార్హం. మరో విషయం ఏమిటంటే... ఉప ఎన్నిక ఏకగ్రీవం కావడానికి భూమా, కాటసాని వర్గాలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.