: యోగి వైఖరి పట్ల ముస్లిం మత పెద్దల విస్మయం!


రంజాన్ మాసం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వడం లేదనే వార్త ఇప్పుడు చర్చనీయాంశం అయింది. యోగి నిర్ణయంపై ముస్లిం మత పెద్దలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ నెలలో చైత్ర నవరాత్రి సందర్భంగా బీజేపీ నేతలకు ఫలహార విందును యోగి ఏర్పాటు చేశారని... ఇప్పుడు ముస్లింలకు ఇఫ్తార్ విందును ఇవ్వకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. రాజ్ నాథ్ సింగ్, కల్యాణ్ సింగ్ లాంటి వారు కూడా సీఎంలుగా ఉన్నప్పుడు ఇఫ్తార్ విందులు ఇచ్చారని గుర్తు చేశారు. దేశంలో లౌకికవాదాన్ని కాపాడేందుకే వారు విందు ఇచ్చారని చెప్పారు. అయితే, యోగికి విరుద్ధంగా ఆర్ఎస్ఎస్ స్పందించింది. తాము ఇఫ్తార్ విందు ఇస్తామని ఆర్ఎస్ఎస్ ముస్లిం విభాగమైన రాష్ట్రీయ ముస్లిం మంచ్ ప్రకటించింది.

  • Loading...

More Telugu News