: వాజ్ పేయి కూడా ఇఫ్తార్ విందు ఇచ్చారు... ఈ సీఎం మాత్రం ఇవ్వరట!


రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలు ఇఫ్తార్ విందులు ఇవ్వడం సాధారణ విషయమే. బీజేపీ అగ్రనేతలు వాజ్ పేయి, రాజ్ నాథ్ సింగ్, కల్యాణ్ సింగ్ లాంటి వాళ్లు కూడా ఇఫ్తార్ విందులు ఇచ్చినవారే. అయితే, ఉత్తరప్రదేశ్ యంగ్ అండ్ డైనమిక్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రం ఈ సంప్రదాయానికి చరమగీతం పాడే సూచనలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ఆయన అధికార నివాసంలో ఇఫ్తార్ విందు ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఇఫ్తార్ విందును ఇవ్వకపోతే... ఇలా చేసిన రెండో బీజేపీ ముఖ్యమంత్రిగా యోగి రికార్డుల్లోకి ఎక్కుతారు. ఇంతకు ముందు రామ్ ప్రకాశ్ గుప్తా కూడా ఇఫ్తార్ విందును ఇవ్వలేదు. మరోవైపు, నరేంద్రమోదీ కూడా ప్రధాని అయిన తర్వాత ఇంత వరకు ఇఫ్తార్ విందులు నిర్వహించలేదు.

  • Loading...

More Telugu News