: విజయ్ మాల్యానా.. మజాకానా!: దర్జాగా స్టేడియంకు వచ్చి, క్రికెట్ ను వీక్షించిన వైనం!
లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యా... ఆయన ఏది చేసినా ఒక సంచలనమే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బ్యాంకులకు భారీ ఎత్తున రుణాలను ఎగ్గొట్టి లండన్ కు పారిపోయిన ఆయనను... భారత్ కు రప్పించేందుకు ఎంతో ప్రయత్నం జరుగుతోంది. ఆయన మాత్రం దర్జాగా వచ్చి క్రికెట్ మ్యాచ్ చూశారు. నిన్న భారత్-పాక్ ల మధ్య ఎడ్జ్ బాస్టన్ లో జరిగిన మ్యాచ్ కు ఆయన విచ్చేశారు. దాయాదుల సమరాన్ని స్టాండ్స్ లో కూర్చొని వీక్షించారు. పరారీలో ఉన్న ఓ వ్యక్తి, ఇంత ధైర్యంగా, దర్జాగా వచ్చి క్రికెట్ చూడటం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా క్రికెట్ దిగ్గజం గవాస్కర్ తో కూడా ఆయన కొంత సమయాన్ని గడిపారు.