: అన్ని పార్టీల సహకారంతోనూ అనుకున్న లక్ష్యం సాధిస్తాం: రఘువీరారెడ్డి


అన్ని పార్టీల సహకారంతో ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు కృషి చేస్తున్నామని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. గుంటూరులో ఏపీ ప్రత్యేక హోదా భరోసా సభ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, డీఎంకే ఎంపీ ఇళంగొవన్, ఆర్జేడీ నేత జయప్రకాశ్ నారాయణ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత లు దిగ్విజయ్ సింగ్, కేవీపీ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకుగాను గతంలో పార్లమెంటులో కేవీపీ ప్రయివేటు బిల్లు ప్రవేశపెట్టినా, కోటి సంతకాలు సేకరించినా, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబులపై కేసులు పెట్టినా, రాహుల్ నినదించినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. అందువల్లే, అన్ని పార్టీల సహకారంతో తాము అనుకున్న లక్ష్యం సాధించాలనే దిశగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనతో పాటు పునర్విభజన చట్టంలోని మిగతా అంశాల సాధనే తమ పార్టీ లక్ష్యమని రఘువీరా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News