: రాహుల్ బస చేసిన హోటల్లోకి దూసుకెళ్లేందుకు టీడీపీ కార్యకర్తల యత్నం!


కొంచెం సేపటి క్రితం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అక్కడి నుంచి విజయవాడలోని ఓ హోటల్ లో బస చేసేందుకు చేరుకున్నారు. అయితే, రాహుల్ రాకను నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ఇతర నేతలు ఆ హోటల్ వద్ద ధర్నాకు దిగారు. ‘రాహుల్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేస్తున్నారు. హోటల్ లోకి దూసుకెళ్లేందుకు వారు యత్నించారు. ఈ నేపథ్యంలో టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News