: గన్నవరం చేరుకున్న రాహుల్.. ఘన స్వాగతం పలికిన నేతలు!
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కొంచెం సేపటి క్రితం కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. రాహుల్ కు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, మునియప్ప, కేవీపీ రామచంద్రరావు, పల్లంరాజు, సుబ్బరామిరెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో రాహుల్ విజయవాడలో కాంగ్రెస్ పార్టీ నేతలతో భేటీ కానున్నారు. అనంతరం రామవరప్పాడు నుంచి గుంటూరుకు ర్యాలీగా వెళతారు. గుంటూరు-పొన్నూరు రోడ్డులోని ఆంధ్రా-ముస్లిం కళాశాలలో నిర్వహించే ప్రత్యేక హోదా భరోసా సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభలో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, జేడీయూ నేత శరద్ యాదవ్, సీపీఐ నేతలు సురవరం సుధాకర్ రెడ్డి, బి.రాజా, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొంటున్నారు.