: నో టెన్షన్.. భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుందని ప్రకటించిన ఐసీసీ!
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ రోజు భారత్, పాక్ ల మధ్య ఉత్కంఠభరిత పోరు జరగనుంది. అయితే, ఈ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే టెన్షన్ అభిమానుల్లో నెలకొంది. నిన్న రాత్రి లండన్ బ్రిడ్జ్, బోరో మార్కెట్ ల వద్ద ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో... మ్యాచ్ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. అయితే, టెన్షన్ పడాల్సిన అవసరం లేదని... మ్యాచ్ యథావిధిగా జరుగుతుందని ఐసీసీ ప్రకటించింది. మ్యాచ్ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశామని తెలిపింది. బ్రిటీష్ భద్రతా వర్గాలు, నిఘా సంస్థలు కూడా భారత్, పాక్ క్రికెట్ బోర్డులకు ఆటగాళ్ల భద్రతపై భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది.