: శ్రీలంక విజ‌య ల‌క్ష్యం 300 ప‌రుగులు


ఇంగ్లండ్‌లో కొన‌సాగుతున్న ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో నేటి మ్యాచులో దక్షిణాఫ్రికా-శ్రీలంక తలపడుతున్న విషయం తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన‌ ద‌క్షిణాఫ్రికా.. శ్రీ‌లంక ముందు 300 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది. సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఆమ్లా 103, డీ కాక్ 23, ఫాఫ్ 75, ఏబీ డీ విల్లియ‌ర్స్ 4, మిల్ల‌ర్ 18, డ్యుమిని (నాటౌట్‌) 38, మోర్రిస్ 20, పార్నెల్ (నాటౌట్) 7 ప‌రుగులు చేశారు. ఎక్స్ ట్రాల రూపంలో సౌతాఫ్రికాకి 11 ప‌రుగులు వ‌చ్చాయి. దీంతో నిర్ణీత 50 ఓవ‌ర్ల‌కి ఆరు వికెట్ల న‌ష్టానికి సౌతాఫ్రికా 299 ప‌రుగులు చేసింది. శ్రీ‌లంక బౌల‌ర్ల ప్ర‌దీప్ కి రెండు వికెట్లు ద‌క్కగా, ల‌క్మ‌ల్, ప్ర‌స‌న్న‌ల‌కు చెరో వికెట్ ద‌క్కాయి.            

  • Loading...

More Telugu News