: మరోసారి కలకలం.. కాబూల్‌లో వరుస బాంబు పేలుళ్లు... 18 మంది మృతి
అఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని భారత దౌత్యకార్యాలయం సమీపంలో సంభవించిన భారీ పేలుళ్ల ఘటన నుంచి తేరుకోకముందే ఈ రోజు మరోసారి వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ప్రాంతంలోని ఖేర్ ఖానాలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుళ్లలో 18 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అక్కడి అధికారులు తెలిపారు. ఇటీవల కాబూల్‌లో జరిగిన భారీ పేలుళ్లకు నిరసనగా ఆ ప్రాంతంలో నిన్న భారీ ర్యాలీ చేపట్టారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు భద్రతాసిబ్బంది కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో సెనేటర్ ఎజద్యార్ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ రోజు అతడి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ఈ వరుస బాంబు పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది.