: ఎయిర్ఏషియా బంపర్ ఆఫర్.. రేపటి నుంచే!
మలేషియా విమానయాన సంస్థ ఎయిర్ ఏసియా తమ విమాన టికెట్లపై బంపర్ ఆఫర్లను ప్రకటించింది. బెంగళూరు, న్యూఢిల్లీ, హైదరాబాద్, కొచ్చి, గోవా, శ్రీనగర్, రాంచి, కోల్ కతా వంటి దేశీయ మార్గాల్లో ప్రయాణించాలనుకుంటే రూ.1,099కే టిక్కెట్ ధరలను అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొంది. అదే అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించేవారు రూ.2999లకే టికెట్‌ను పొందవచ్చని తెలిపింది. ఇందుకోసం బుకింగ్‌లను రేపటి నుంచి 11వ తేదీ లోపు చేసుకోవాలని, బుక్ చేసుకున్న వారు 2018 జనవరి 15వ తేదీ నుంచి 2018 ఆగస్ట్ 28వ తేదీ మధ్య ప్రయాణించవచ్చని పేర్కొంది.
తాము ప్రకటిస్తోన్న తాజా ఆఫర్లు ఆసియా, ఆస్ట్రేలియా వ్యాప్తంగా 120 ప్రాంతాల్లోని ప్రయాణికులకు అందుబాటులో ఉంటున్నాయని, ప్రయాణికులు ఒక్కసారి మాత్రమే ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. విమానాశ్రయ రుసుం వంటి అన్నిరకాల ఛార్జీలు కూడా అందులోనే ఉంటాయని పేర్కొంది.