: బీహార్ లో 60 వేల లీటర్ల మద్యాన్ని పార‌బోసేశారు!


బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్‌కుమార్ త‌మ రాష్ట్రంలో సంపూర్ణ‌ మ‌ద్యపాన నిషేధం విధిస్తూ గొప్ప నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. త‌మ రాష్ట్రంలోకి అక్ర‌మంగా మ‌ద్యం త‌ర‌లిరాకుండా అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అయిన‌ప్ప‌టికీ కేటుగాళ్లు మ‌ద్యం అమ్మే ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా రోహ్‌తక్ జిల్లాలో ఓ గోడౌన్‌పై దాడి చేసిన అధికారులకు అక్క‌డ‌ పెద్ద మొత్తంలో మ‌ద్యం సీసాలు క‌నిపించాయి. దీంతో వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు... అనంత‌రం మ‌ద్యాన్ని పార‌బోశారు. రోడ్ రోలర్‌తో ధ్వంసం చేశారు. మొత్తం 60వేల లీటర్ల మద్యాన్ని ధ్వంసం చేసిన‌ట్లు అధికారులు తెలిపారు. అధికారుల‌కు ఆ ప్రాంతంలో నాటుసారా, గుడుంబా ప్యాకెట్లు కూడా క‌నిపించ‌డంతో వాటిని కూడా పారబోశారు.               

  • Loading...

More Telugu News