: ఈ నెలాఖరు వరకు తూ.గో. జిల్లాలో సెక్షన్-30 అమలు!
జిల్లాలో ఈ నెలాఖరు వరకు సెక్షన్-30ని అమలు చేస్తున్నట్టు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ తెలిపారు. ఈ సెక్షన్ అమల్లో ఉన్నన్ని రోజులు ఆయా సబ్ డివిజన్ పోలీసు అధికారి అనుమతి లేకుండా ధర్నాలు, సమావేశాలు నిర్వహించరాదని చెప్పారు. శబ్దకాలుష్యానికి కారణమయ్యే సౌండ్ బాక్సులు కూడా పెట్టరాదని తెలిపారు. కాకినాడ, పెద్దాపురం, రామచంద్రాపురం, రంపచోడవరం, అమలాపురం, చింతూరు పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో సెక్షన్-30 అమల్లో ఉంటుందని చెప్పారు.