: కశ్మీర్ లో ఆర్మీ కాన్వాయ్ పై ఉగ్రదాడి.. దీటుగా జవాబు చెబుతున్న సైన్యం
జమ్ముకశ్మీర్ లో ఆర్మీ కాన్వాయ్ పై ఉగ్రవాదులు పంజా విసిరారు. కశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలోని ఖాజీగండ్ ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఆర్మీ కాన్వాయ్ పై కాపు కాసిన ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది. కాగా, సైన్యం దీటుగా స్పందిస్తున్నట్టు తెలుస్తోంది.