: ఉగ్రవాదుల మూలాలపై కన్నేసిన ఎన్ఐఏ... 14 చోట్ల దాడులు


కశ్మీర్లో పోలీసులు, సైనికులు, భద్రతాదళాలకు నిద్ర లేకుండా చేస్తున్న ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్న అధికారులు, తాజాగా దాని మూలాలపై దెబ్బతీస్తే కానీ సరైన ఫలితం ఉండదని నిర్ణయానికి వచ్చారు. దీంతో తీవ్రవాదులకు ఆర్థిక సాయం ఎక్కడి నుంచి వస్తోంది? ఎలా వస్తోంది? ఎవరు చేస్తున్నారు? వంటి విషయాలపై నిఘా వేశారు. ఈ నేపథ్యంలో తీవ్రవాదులకు రహస్య సాయం చేస్తున్న ఆర్థిక శక్తులపై ఎన్ఐఏ దాడులు చేసింది.

పక్కా సమాచారం, సాక్ష్యాలతో న్యూఢిల్లీ, శ్రీనగర్ లోని 14 ప్రాంతాల్లోని వేర్పాటువాదుల ఇళ్లపై ఏకకాలంలో అకస్మిక దాడులు చేసింది. గతంలో ఒక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు, ఆ స్టింగ్ లో ఎవరెవరైతే పాకిస్థాన్ నుంచి నిధులు అందుకుంటున్నామని అంగీకరించారో వారందరి ఇళ్లపై దాడులు చేశారు. అందులో కశ్మీరీ వేర్పాటువాది నయీం ఖాన్, ఫరూఖ్ అహ్మద్ దార్ అలియాస్ ‘బిట్టా కరాటే’, జావేద్ అహ్మద్ బాబా అలియాస్ ‘ఘాజీ’ తదితరుల నివాసాలపై దాడులు చేసింది. ఈ సోదాల్లో పలు కీలక అంశాలు సేకరించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News