: మావోయిస్టు కమాండర్ ను కాల్చి చంపిన పోలీసులు


ఆంధ్ర-ఒడిశా బోర్డర్ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఈ ఉదయం పోలీసులు, మావోయిస్టుల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఒడిశా మల్కన్ గిరి జిల్లా చిత్రకొండ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కాల్పుల్లో దళ కమాండర్ చిన్నబ్బాయ్ మృతి చెందాడు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.  

  • Loading...

More Telugu News