: ప్రియాంక వేసుకున్న దుస్తులకు సన్నీలియోన్ సపోర్ట్!


ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడే ఉన్న బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఆయనను బెర్లిన్ లో కలిసింది. ఈ సందర్భంగా పొట్టి దుస్తులు ధరించి, ప్రధాని ముందు కాలుపై కాలు వేసుకుని కూర్చున్న ప్రియాంకపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. దీనిపై శృంగార తార సన్నీలియోన్ స్పందించింది. ఏ దుస్తులు ధరించాలి? అనేది ప్రియాంక ఇష్టమని చెప్పింది. ఎదుటి వారు ఎలాంటి దుస్తులు వేసుకున్నారనే విషయం కాకుండా, వారి చర్యలను మాత్రమే మనం చూడాలని సూచించింది. మనమంతా ఒకరిని మరొకరు ప్రేమించుకోవాలే తప్ప... ద్వేషించుకోరాదని చెప్పింది. ప్రియాంక చాలా మంచి వ్యక్తి అని... సమాజానికి ఆమె ఎంత సేవ చేస్తోందో తనకు తెలుసని తెలిపింది.

ప్రధాని మోదీ చాలా హుందాతనం ఉన్న వ్యక్తి అని... తనకు నచ్చని విషయాలను కుండ బద్దలు కొట్టినట్టు చెబుతారని... ప్రియాంక దుస్తుల విషయంలో ఆయనకు ఏదైనా ఇబ్బంది అనిపించి ఉంటే, నేరుగా ఆమెకే చెప్పి ఉండేవారని సన్నీ తెలిపింది.

  • Loading...

More Telugu News