: 500 కోట్లు ఇవ్వకపోతే అంతు చూస్తాం: విప్రోకు బెదిరింపు మెయిల్!
ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రోకు బెదిరింపులు వచ్చాయి. గతంలో ఒకసారి బెదిరించిన దుండగులు మరోసారి బెంగళూరులోని విప్రో ప్రధాన కార్యాలయానికి మెయిల్ పంపారు. ఈ మెయిల్ లో విప్రోపై బయో దాడికి పాల్పడతామని హెచ్చరించారు. 500 కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేని పక్షంలో విప్రో కార్యాలయంలోకి విషపూరిత గ్యాస్ ను పంపిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. బయో దాడి బారిన పడకుండా ఉండాలంటే తాము చెప్పినట్టు చేయాలని వారు సూచించారు. తమకు 500 కోట్ల రూపాయలు ఉన్నపళంగా ఇవ్వాలని వారు హెచ్చరించారు. దీంతో విప్రో ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.