: దేశం గర్వించే ప్రదర్శన చేస్తాం: 'భారత్ తో మ్యాచ్'పై పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్


టీమిండియాతో రేపు జరగనున్న మ్యాచ్ లో సామర్థ్యం మేరకు రాణిస్తామని పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ తెలిపాడు. లండన్ లో మాట్లాడుతూ, రేపు భారత్ తో జరిగే మ్యాచ్ లో దేశం గర్వించే ప్రదర్శన చేస్తామని అన్నాడు. పాక్ ఆటగాళ్లంతా రేపటి మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పాడు. భారత్ తో మ్యాచ్ కోసం తాము ఎలాంటి ఒత్తిడికి గురికావడం లేదని అన్నాడు. మ్యాచ్ కు ముందు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత బాగా ఆడతామని చెప్పాడు.

బౌలింగ్ విభాగంలో తమ జట్టు బలంగా ఉందని తెలిపాడు. రేపటి మ్యాచ్ లో పిచ్ ఫలితాన్ని నిర్ణయిస్తుందని చెప్పాడు. ముగ్గురు లేదా నలుగురు పేసర్లతో బరిలో దిగుతామని సర్ఫరాజ్ తెలిపాడు. పేస్, స్పిన్ మేళవింపుతో భారత్ కు షాకిస్తామని ఆయన చెప్పాడు. భారత్ తో మ్యాచ్ లో వందశాతం సామర్థ్యం ప్రదర్శిస్తామని సర్ఫరాజ్ తెలిపాడు. 

  • Loading...

More Telugu News