: ‘శ‌మంతక‌మ‌ణి’ ఫ‌స్ట్ లుక్ ను ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన మహేశ్ బాబు!


భవ్య క్రియేష‌న్స్ బేన‌ర్ పై టాలీవుడ్ యంగ్ నటులు సందీప్ కిష‌న్, సుధీర్ బాబు, నారా రోహిత్, ఆది ప్ర‌ధాన పాత్ర‌ల‌లో దర్శకుడు శ్రీరామ్ రూపొందిస్తోన్న 'శ‌మంతక‌మ‌ణి' చిత్రంలోని సుధీర్ బాబు ఫస్ట్ లుక్‌ని ఈ రోజు న‌టుడు మ‌హేశ్ బాబు త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా విడుద‌ల చేశాడు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కూడా ఓ కీల‌క పాత్రలో న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో నారా రోహిత్ ఇన్స్ పెక్ట‌ర్ రంజిత్ కుమార్ అనే పాత్రలో న‌టిస్తుండ‌గా, ఆది.. కార్తీక్ అనే పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇక‌ సుధీర్ బాబు.. కృష్ణ అనే పాత్రలో క‌నిపించ‌నున్న‌ట్లు మ‌హేశ్ బాబు తెలిపాడు.                



  

  • Loading...

More Telugu News