: బీటెక్ ఫస్టియర్ విద్యార్థిని ఆత్మహత్య... మృతదేహంతో కాలేజీలో బంధువుల ఆందోళన!
రంగారెడ్డి జిల్లా శేరిగూడ శ్రీ ఇందు ఇంజనీరింగ్ కాలేజీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఆమె బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థిని మృతదేహంతో ఆ కాలేజీ ఎదుట ఆమె బంధువులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని బీటెక్ ఫస్టియర్ చదువుతున్న రోహిణి అని తెలిపారు.