: భారత వాయుసేన మరింత బలోపేతం.. రష్యా నుంచి భారత్‌కు రానున్న అత్యాధునిక రక్షణ వ్యవస్థ
భారతీయ వాయు సేనలోకి రష్యా నుంచి అత్యాధునిక ఎస్-400 ‘ట్రయమ్ఫ్’ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్స్ రానున్నాయి. తాజాగా రష్యా ఉప ప్రధాని దిమిత్రి రొగొజిన్ ఈ అంశంపై మాట్లాడుతూ.. భారత్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్స్ ను అందించేందుకు ప్రస్తుతం ప్రీ కాంట్రాక్ట్ ఏర్పాట్లు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇందుకోసం రష్యాతో భారత్ గత ఏడాది ఒప్పందం చేసుకుంది. మొత్తం రూ.60 వేల కోట్ల ఖర్చుతో చేసుకున్న రక్షణ రంగ ఒప్పందాల్లో ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఓ భాగం మాత్రమే.