: భారత్‌లో 'ట్రూకాలర్' విజృంభణ... ఫేస్‌బుక్ యాప్ కన్నా ఎక్కువగా వాడేస్తున్నారు!
మన కాంటాక్ట్ లిస్టులో లేని నెంబరు నుంచి మనకు ఫోన్ వస్తే, అది ఎవరి నుంచి వచ్చిందన్న విషయాన్ని మనకు ట్రూకాలర్ యాప్ పుణ్యమాని ఇప్పుడు తెలుస్తోంది. ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే గుర్తు తెలియని నెంబరు నుంచి ఫోన్ వచ్చినా ఆ కాల్ చేస్తున్న వారి పేరు ఏంటో మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు భారత్‌లో ఈ యాప్ దూసుకుపోతోంది. ఎంతగా అంటే ఫేస్‌బుక్‌ను అత్యధికంగా ఉపయోగించే భారతీయులు ఆ యాప్‌ను మించి ట్రూకాలర్ యాప్‌ను డౌన్‌లోడ్స్ చేసుకున్నారు. దీంతో ట్రూకాలర్ భారత్‌లో ఫేస్‌బుక్ ను మించేసింది.
అంతేకాదు, గూగుల్ ప్లే స్టోర్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా డౌన్‌లోడ్ అవుతున్న యాప్‌లలో వాట్సప్, మెసెంజర్, షేర్‌ఇట్‌లు మొదటి మూడు స్థానాల్లో ఉంటే ట్రూకాలర్ నాలుగో స్థానంలో ఉంది. ఈ యాప్‌లన్నింటినీ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. ఆయా కంపెనీలు తమ యాప్‌కు వచ్చే యాడ్స్ ద్వారా ఆదాయాన్ని సంపాదించుకుంటాయి. ట్రూకాలర్ యాప్ ప్రకటనల్లో రోజుకు లక్ష క్లిక్కులతో దూసుకుపోతోంది.