: ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం: నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు


ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాకు మించిన ప్యాకేజీని ఏపీకి ఇస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం కూడా సంతృప్తిగానే ఉందని తెలిపారు. ప్రత్యేక హోదా అనేది కేవలం ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయపర్వత రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. ఇప్పటికే 11 రాష్ట్రాలు ఈ హోదాను అనుభవిస్తున్నాయని... ఇకపై వేరే రాష్ట్రాలకు ఇవ్వలేమని ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News