: కాపలా కుక్కలా ఉంటానన్న వ్యక్తి.. సీఎం ఎందుకయ్యాడు?: జగ్గారెడ్డి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానని చెప్పిన కేసీఆర్... ముఖ్యమంత్రి ఎందుకయ్యారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రశ్నించారు. తండ్రి ముఖ్యమంత్రి, కుమారుడు మంత్రి, కుమార్తె ఎంపీ, మేనల్లుడు మంత్రి... ఎవరైనా సరే దీన్ని కుటుంబ పాలన అని అనరా? అని మండిపడ్డారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే... కేసీఆర్ కుటుంబం మొత్తం ఈరోజు రోడ్డుపై ఉండేదని అన్నారు. తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ కు లేదని చెప్పారు.