: దాసరి మరణంతో కాలగర్భంలో కలిసిపోయిన నిజాలు!
దర్శకరత్న మరణంతో సినీ పరిశ్రమలోని కొందరు పెద్దలు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, గతంలో జరిగిన ఓ ఈవెంట్ లో తాను గత మూడు, నాలుగేళ్లుగా ఓ పుస్తకం రాస్తున్నానని... పూర్తి కావడానికి మరో ఏడాదిన్నర పడుతుందని దాసరి చెప్పారు. ఈ పుస్తకంలో సీనీ పరిశ్రమలో గొప్ప వాళ్లుగా చెప్పుకుంటున్న వారి అసలైన చరిత్రలు ఉంటాయని చెప్పి, సంచలనం రేకెత్తించారు. దాసరి వ్యాఖ్యల నేపథ్యంలో, అప్పట్లో అలజడి చెలరేగింది.
అయితే, దాసరి అకాల మరణంతో వాస్తవాలన్నీ కాలగర్భంలో కలిసిపోయినట్టైంది. దీనిపై ఇప్పుడు మళ్లీ చర్చ ప్రారంభమైంది. దాసరి తన పుస్తకంలో ఎవరెవరి గురించి రాసి ఉంటారనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ పుస్తకం ఇక ఎప్పుడూ బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో... అవతలి వ్యక్తులు ఊపిరి పీల్చుకున్నారు.