: ఛాంపియన్స్ ట్రోఫీ: ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ.. ఒక్క పరుగుకే ఓపెనర్ రాయ్ అవుట్!
ఓవల్‌లో జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2017 తొలి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ అద్భుతంగా రాణించి, ఇంగ్లండ్ ముందు 306 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన విషయం తెలిసిందే. లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్ బౌలర్ మోర్‌టాజా చేతిలో ఇంగ్లండ్ ఓపెనర్ రాయ్ కేవలం 1 పరుగు వ్యక్తిగత స్కోరు వద్దే వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో మరో ఓపెనర్ హేల్స్ 5, రూట్స్ 6 పరుగులతో ఉన్నారు. ఇంగ్లండ్ స్కోరు నాలుగు ఓవర్లకి 13 పరుగులుగా ఉంది.