: ఉగ్రవాదులనుకొని సొంత సైన్యంపైనే వైమానిక దాడి చేసిన ఫిలిప్పీన్స్ సైన్యం... 10 మంది సైనికుల మృతి


ఫిలిప్పీన్స్ సైనికులు పొరపాటుపడి తమ సైనికులపైనే దాడి చేయడంతో 10 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గుంపుగా ఉన్న త‌మ సైనికుల‌ను విమానం నుంచి చూసి వారంతా ఉగ్ర‌వాదులుగా పొర‌ప‌డ్డామ‌ని వారు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో ఎనిమిది మంది సైనికుల‌కు తీవ్ర‌గాయాల‌య్యాయి. ఇదిలా ఉంచితే, ఇస్లామిక్‌స్టేట్‌కు అనుబంధంగా ఉన్న ఉగ్రవాదులపై ఫిలిప్పీన్స్‌ సైన్యం దాడులు చేయ‌గా 100మంది ఉగ్ర‌వాదులు హ‌తమ‌య్యారు. ఫిలిప్పీన్స్‌ భద్రతా దళాలంతా ఆ ఉగ్ర‌వాద సంస్థ నాయకుడు లిస్నిలోన్‌ హపిలోన్ ను అరెస్టు చేసేందుకు దాడులు మొద‌లుపెట్టాయి. ఆయ‌న‌ను కాపాడుకునేందుకు పెద్ద సంఖ్య‌లో ఉగ్ర‌వాదులు అక్క‌డ‌కు చేరుకుని ప‌లు ప్రాంతాలను త‌మ అధీనంలోకి తీసుకున్నారు. దీంతో సైన్యం పెద్ద ఆప‌రేష‌న్ నిర్వ‌హిస్తోంది.

  • Loading...

More Telugu News