: బీజేపీలో చేరుతున్న కేసీఆర్ అన్న కూతురు!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కుమార్తె రమ్య బీజేపీలో చేరుతున్నారు. ప్రస్తుతం ఆమె తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల చేపట్టిన తెలంగాణ పర్యటనలో తమ పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశం చేశారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే క్రమంలో ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలను బీజేపీలోకి ఆహ్వానించాలంటూ ఆయన సూచించారు. ఈ క్రమంలోనే రమ్య బీజేపీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. అయితే, తమ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ కు వస్తున్న సమయంలోనే... రమ్య పార్టీ మారుతున్నానని చెప్పడం కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇబ్బందికరంగా మారింది.