: స్విమ్మింగ్ పూల్‌లో ప‌డిపోయి.. అమెరికాలో కుమారుడితో పాటు తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ మృతి


అమెరికాలో నాగ‌రాజు అనే తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్, అత‌డి మూడేళ్ల‌ కుమారుడు మృతి చెందారు. నిన్న సాయంత్రం నాగ‌రాజు త‌న‌ కుమారుడితో పాటు స‌ర‌దాగా స్విమ్మింగ్ పూల్ వైపు వ‌చ్చాడ‌ని, అదే స‌మ‌యంలో ప్ర‌మాద‌వశాత్తు అత‌డి కుమారుడు అందులో ప‌డిపోయాడ‌ని తెలిసింది. కొడుకుని కాపాడేందుకు స్విమ్మింగ్ పూల్లోకి దిగిన నాగ‌రాజు కూడా అందులో మునిగిపోయాడ‌ని అక్కడి అధికారులు తెలిపారు. ఈ స‌మాచారాన్ని అక్క‌డి పోలీసులు నాగ‌రాజు త‌ల్లిదండ్రుల‌కు కొద్దిసేప‌టి క్రితం ఫోనులో తెలిపారు. నాగరాజు స్వస్థలం గుంటూరు లోని నెహ్రూ నగర్. ఆయనకు 2012లో వివాహం జ‌రిగింది. ఇన్ఫోసిస్‌లో ప‌నిచేస్తున్న నాగ‌రాజు త‌న భార్య‌తో క‌లిసి 2014లో అమెరికాకు వెళ్లాడు.      

  • Loading...

More Telugu News