: నేను మామూళ్లు తీసుకున్నానని నిరూపిస్తే.. రాజీనామా చేస్తా: ఎస్పీ చందనా దీప్తి
తాను మామూళ్లు తీసుకున్నానంటూ ఓ దినపత్రికలో కథనం వచ్చిందని... అది నిజమని నిరూపిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని మెదక్ ఎస్పీ చందనా దీప్తి అన్నారు. ఇలాంటి నిరాధారమైన వార్తలు రాయడం వల్లే పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతోందని చెప్పారు. ప్రజలకు ఉపయోగపడేలా వాస్తవాలను మాత్రమే రాయాలని సూచించారు. మీడియా సహకరిస్తే పోలీసులు మరింత మెరుగైన పనితీరు కనబరుస్తారని చెప్పారు. జిల్లాలో పోలీసుల పనితీరు మెరుగుపడిందని... ఎవరైనా లంచాలు తీసుకున్నట్టు తెలిస్తే, కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తన కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.