: రష్యా చేరుకున్న ప్రధాని మోదీ... ఘన స్వాగతం
ప్రధాని నరేంద్ర మోదీ రష్యా చేరుకున్నారు. యూరోప్ పర్యటనలో భాగంగా మోదీ ఇప్పటికే జర్మనీ, స్పెయిన్ దేశాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన రష్యా చేరుకున్నారు. సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఆయనకు రష్యా అధికారులు ఘన స్వాగతం పలికారు. గౌరవసూచకంగా రష్యన్ ఆర్మీ బ్యాండ్ భారత జాతీయగీతం ఆలపించింది. 18వ రష్యా-భారత్ ద్వైపాక్షిక సదస్సులో మోదీ పాల్గొనున్నారు. ఈ సందర్భంగా రష్యాతో బలమైన బంధం ఏర్పర్చుకునే దిశగా పలు చర్యలు తీసుకోనున్నారు.