: అస్వస్థతతో అంధేరీ ఆసుపత్రిలో చేరిన కమేడియన్ కపిల్ శర్మ!


హిందీ టీవీ బుల్లితెర హాస్య నటుడు కపిల్ శర్మ అస్వస్థతకు గురయ్యాడు. రక్తపోటు ఒక్కసారిగా పడిపోవడంతో కపిల్ శర్మ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతనిని ముంబైలోని అంధేరీ ఆసుపత్రికి తరలించారు. 'కామెడీ సర్కస్' హిందీ టీవీ షోతో వెలుగులోకి వచ్చిన కపిల్ శర్మ... 'కామెడీ నైట్స్ విత్ కపిల్'తో బుల్లితెర స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. కలర్స్ ఛానెల్ తో విభేదాలు ఏర్పడడంతో సోనీలో కపిల్ షో పేరిట కామెడీ షోను నిర్వహిస్తున్నాడు. ఈ మధ్యే అదే షోలో పాల్గొనే సహకమెడియన్ సునీల్ గ్రోవర్ తో విభేదాల వల్ల కపిల్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి అతనికి చికిత్స అందిస్తున్నామని, ఎలాంటి సమస్య లేదని, ఆయన ప్రస్తుతం బాగానే ఉన్నారని వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News