: ఏ విషయమైనా నాకు స్వయంగా కాల్ చేయండి: 'వివిధ దేశాధినేతలకు ట్రంప్ ఆఫర్'పై విస్తుపోతున్న అమెరికా అధికారులు
ఏ సమస్య ఎదురైనా, ఏ విషయమైనా తనకే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడాలని చెబుతూ, తన వ్యక్తిగత నంబరును వివిధ దేశాధినేతలకు అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇస్తుండటంపై ఆ దేశ భద్రతాధికారులు విస్తుపోతున్నారు. తన వ్యవహార శైలితో కలకలం రేపుతున్న ఆయన, మెక్సికో, కెనడా సహా పలు ప్రపంచ దేశాల అధినేతలకు తన ఫోన్ నంబర్ ఇచ్చి, ఎప్పుడైనా తనతో మాట్లాడవచ్చని ట్రంప్ వెల్లడించగా, దీని వల్ల దౌత్యపరమైన రహస్యాలు, దేశ భద్రతాంశాలతో పాటు, కీలక విషయాలు హ్యాకర్ల చేతికి వెళ్లే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా, ట్రంప్ ఇచ్చిన ఆఫర్ ను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడే ఇప్పటికే వినియోగించుకున్నారు. ఆయనకు ఫోన్ చేసి పలు విషయాలపై చర్చించారు. కాగా, అమెరికా అధ్యక్షుడితో ఇతర దేశాలవారెవరైనా మాట్లాడాలంటే, అత్యంత సెక్యూర్డ్ ల్యాండ్ లైన్ నే వినియోగిస్తారన్న సంగతి తెలిసిందే.