: విమాన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాం..!: సన్నీలియోన్


తాము విమాన ప్రమాదం నుంచి తృటిలో త‌ప్పించుకున్నామ‌ని బాలీవుడ్‌ నటి సన్నీలియోన్ తెలిపింది. తాము ప్రాణాలతో ఉన్నందుకు దేవుడికి ధన్యవాదాలు చెబుతున్నామ‌ని ఆమె త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసింది. తాము ప్ర‌యాణిస్తున్న ప్రైవేట్ విమానం వాతావరణం అనుకూలించని కారణంగా ప్రమాదానికి గురి కాబోయిందని ఆమె చెప్పింది. తమ పైలట్ ఎంతో చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి త‌మ‌ను ర‌క్షించాడ‌ని తెలిపింది. తాము మహారాష్ట్రలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉన్నామని, ఇంటికి వెళుతున్నామ‌ని ఆమె ఈ సెల్ఫీ వీడియో తీస్తున్న స‌మ‌యంలో చెప్పింది. ఆమె ప్ర‌యాణిస్తున్న‌ కారులో తన స్నేహితులు, భర్త డేనియల్ కూడా ఉన్నారు. వారు కూడా దేవుడికి కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్న‌ట్లు పేర్కొన్నారు.
 
 

  • Loading...

More Telugu News