: షూటింగ్ లో గాయాలపాలైన హీరో అజిత్!
ప్రముఖ తమిళ నటుడు అజిత్‌కి గాయాలయ్యాయి. శివ దర్శకత్వంలో అజిత్ నటిస్తున్న కొత్త సినిమా 'వివేగం' షూటింగ్ ప్రస్తుతం యూరప్‌లో కొనసాగుతోంది. ఈ రోజు అందుకు సంబంధించి పలు యాక్షన్ సన్నివేశాల్లో అజిత్ నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే అజిత్ కొంత ఎత్తు నుంచి కింద పడిపోయాడు. దీంతో ఆయన భుజానికి గాయాలయ్యాయి. ఆయన ప్రస్తుతం అక్కడి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి వివేగం యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ వార్తను తెలుసుకున్న అజిత్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అజిత్ కు అయిన గాయాలు ఏ పాటివో ఇంకా తెలియరాలేదు.