: యూపీఎస్సీ సివిల్స్-2016 ఫలితాలు విడుదల.. కర్ణాటకకు చెందిన కె.ఆర్.నందినికి మొదటి స్థానం
యూపీఎస్సీ సివిల్స్-2016 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలకుగానూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గత ఏడాది డిసెంబరులో రాత పరీక్ష నిర్వహించింది. అనంతరం ఈ ఏడాది మార్చి నుంచి ఈ నెల 15 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఇందులో మొత్తం 1099 మంది అభ్యర్థులను యూపీఎస్సీ ఎంపిక చేసింది. వారిని వివిధ శాఖల ఉద్యోగాల్లో త్వరలోనే నియమించనున్నారు. ఈ పరీక్షలో కర్ణాటకకు చెందిన కె.ఆర్.నందిని మొదటి స్థానంలో నిలిచింది. ఇక రెండు, మూడు స్థానాల్లో అనుమోల్ షేర్ సింగ్ బేడీ, జి.రొనాంకి నిలిచారు.